ఢిల్లీ: ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం)పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో సరైన ప్రణాళిక లేకుండా ఎల్ఆర్ఎస్ చేస్తున్నారని సుప్రీం కోర్టులో జనగాంకు చెందిన జువ్వాడి సాగర్ రావు అనే వ్యక్తి సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ ద్వారా అక్రమాలకు పాల్పడిన రియల్ ఎస్టేట్ వారిని, అధికారులను వదిలేసి ప్లాట్లు కొన్నవారు, ఇళ్లు కట్టుకున్నవారిని కేసులు నమోదు చేస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే అక్రమ లేఅవుట్ వల్ల వరదలతో సహా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్, చెన్నైలో వచ్చిన వరదలు రుజువు చేస్తున్నాయని ఆయన పిటిషనర్ వివరించారు. అక్రమ లే అవుట్లకు అనుమతి ఇచ్చిన వారిపై విచారణ జరిపించాలని ఆయన కోరారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ ఆర్ ఎస్ పెద్ద ఎత్తున దరఖాస్తు వచ్చి చేరాయి. సెప్టెంబర్ 1 నుంఇ అక్టోబర్ 31 వరకు రెండు నెలల పాటు ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ కు గడువు విధించగా, 25 లక్షలకు పైగా దరఖాస్తు వచ్చాయి. గ్రేటర్‌తో పాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు.