దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉదృతి రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కొవిడ్ దూకుడుగా ఉండటంతో ప్రజల జీవన విధానం అతలాకుతలమవుతోంది. సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు ఏ ఒక్కరినీ కరోనా రక్కసి వదిలిపెట్టడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న జనం పల్లెబాట పడితే… కొందరు ఫామ్ హౌస్‌కు మకాం మార్చేశారు.
అయితే ఇటీవలే రజినీకాంత్ ఇంటిని కూడా కరోనా తాకినట్లు వార్తలు రావడంతో ఆయన తన ఇంటిని వదిలి చెన్నై నగరానికి దూరంగా ఉన్న ఓ ఫామ్ హౌస్‌కు షిఫ్ట్ అయ్యారు. కరోనా లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ… అత్యంత ఖరీదైన తన లాంబోర్గిని కారులో ఫేస్ మాస్కు పెట్టుకుని..సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ తన ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయారు. ఈ ఫోటో కాస్త.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.
రజనీకాంత్ సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లింది లంబాక్కమ్‌లోని తన ఫాంహజ్‌కు. అదే వ్యవసాయ క్షేత్రంలో గత కొద్ది రోజులుగా ఉంటున్న కూతురు సౌందర్య, అల్లుడు విశాగన్ వానంగమూడి, మనవడు వేద్ కృష్ణతో కలిసి అక్కడే ఉంటున్నారు. వారితో కొద్ది రోజులు ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
#Thalaivar #Superstar #Rajinikanth during his walk today at Kelambakkam Farm house. #TSR #TSRMAINBLR #RMM #ThalaivarLatest pic.twitter.com/eUw37fuxRk
— Praveen (TSR) (@Praveen_TSR) July 21, 2020
మరోవైపు తలైవా ఫాంహౌజ్ పరిసరాల్లో సరదాగా వాకింగ్ చేశారు. ఫారెస్ట్‌లా కనిపిస్తున్న ఆ ప్రాంతంలో ఆయన వాక్ చేస్తున్నపుడు తీసిన వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది.