‘నీటిని కాపాడుదాం.. ప్లాస్టిక్ వాడ‌కం త‌గ్గిద్దాం’.. మ‌హేష్ సోష‌ల్ మెసేజ్..

| Edited By:

Jul 28, 2020 | 2:42 PM

'ప్ర‌పంచ స‌హజ వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ' దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. అభిమానుల‌కు ఓ సోష‌ల్ మెసేస్‌ ఇచ్చారు. మ‌హేష్ బాబుకు సామాజిక స్పృహ చాలా ఎక్కువ‌. అలాగే ప‌లు సామాజిక సందేశ కార్య‌క్ర‌మాలు కూడా చేప‌ట్టారు మ‌హేష్. ఈ మ‌ధ్య‌నే క‌రోనా వైర‌స్ చికిత్స తీసుకుని కోలుకున్నవారు.

నీటిని కాపాడుదాం.. ప్లాస్టిక్ వాడ‌కం త‌గ్గిద్దాం.. మ‌హేష్ సోష‌ల్ మెసేజ్..
Follow us on

‘ప్ర‌పంచ స‌హజ వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ’ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. అభిమానుల‌కు ఓ సోష‌ల్ మెసేస్‌ ఇచ్చారు. మ‌హేష్ బాబుకు సామాజిక స్పృహ చాలా ఎక్కువ‌. అలాగే ప‌లు సామాజిక సందేశ కార్య‌క్ర‌మాలు కూడా చేప‌ట్టారు మ‌హేష్. ఈ మ‌ధ్య‌నే క‌రోనా వైర‌స్ చికిత్స తీసుకుని కోలుకున్నవారు.. స్వ‌చ్ఛంద‌గా వ‌చ్చి ప్లాస్మా డొనేట్ చేయాల‌ని.. ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్న విష‌యం తెలిసిందే. ప్లాస్మా దానం వ‌ల‌న‌.. మ‌రో క‌రోనా సోకిన వ్య‌క్తిని ప్రాణాల‌తో కాపాడిన‌ట్టు అవుతుందని వెల్ల‌డించారు. అలాగే క‌రోనా వైర‌స్ క‌ష్ట కాలంలో కూడా ఆయ‌న ప్ర‌జ‌ల‌ని చైత్య‌వంతుల‌ని చేయ‌డంతో పాటు కోవిడ్‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం కూడా చేశారు. తాజాగా మ‌హేష్ బాబు మ‌రో సోష‌ల్ మెసేజ్‌ను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు.

ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్‌లో.. ‘నీటిని కాపాడుదాం, ప్లాస్టిక్ వాడ‌కాన్ని త‌గ్గిదాం, రీసైకిల్ చేద్దాం, వ్య‌ర్థాల‌ను ఉప‌యోగిద్దాం, పున‌రుత్పాద‌క శ‌క్తిని కాపాడుకుందాం. ఈ సంక్షోభ స‌మ‌యంలో మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకుంటూనే, ప్ర‌కృతిని కూడా ప‌రి ర‌క్షించ‌డం మ‌న బాధ్య‌త‌ని గుర్తించుకోండి. మార్పు అనేది మ‌న నుంచే మొద‌లు కావాల‌ని’ పేర్కొంటూ పోస్ట్ చేశారు.

Read More: 

వీధి వ్యాపారుల‌కు ఊర‌ట‌.. ఉద‌యం 10 నుంచి రాత్రి 8 వ‌ర‌కు ప‌ర్మిష‌న్..

ఏడో నిజాం కుమార్తె బ‌షీరున్నిసా బేగం మృతి

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు షాక్.. రూ.4 వేల‌ ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ..