కమనీయ దృశ్యం…అరసవల్లి సూర్యభగవానుని తాకిన కిరణాలు

|

Mar 09, 2020 | 10:20 AM

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలోని మూలవిరాట్టును సోమవారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. ఆ దృశ్యాలను చూసి భక్తులు పారవశ్యంతో మునిగిపోయారు. మొదట మేఘాలు అడ్డుపడినా, ఆ వెంటనే తొలగిపోవడంతో..కిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. మొదట సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకాయి, తదనంతరం ముఖం వరకు విస్తరించాయి. ఆరు నిమిషాలు పాటు ఈ కమనీయ దృశ్యం సాగింది. ఉత్తరాయణం నుంచి దక్షిణాయణానికి సూర్యుడు గమనం మార్చుకునే సందర్భంలో సూర్యకిరణాలు సూర్యనారాయణ స్వామి పాదాల నుంచి […]

కమనీయ దృశ్యం...అరసవల్లి సూర్యభగవానుని తాకిన కిరణాలు
Follow us on

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలోని మూలవిరాట్టును సోమవారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. ఆ దృశ్యాలను చూసి భక్తులు పారవశ్యంతో మునిగిపోయారు. మొదట మేఘాలు అడ్డుపడినా, ఆ వెంటనే తొలగిపోవడంతో..కిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. మొదట సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకాయి, తదనంతరం ముఖం వరకు విస్తరించాయి. ఆరు నిమిషాలు పాటు ఈ కమనీయ దృశ్యం సాగింది.

ఉత్తరాయణం నుంచి దక్షిణాయణానికి సూర్యుడు గమనం మార్చుకునే సందర్భంలో సూర్యకిరణాలు సూర్యనారాయణ స్వామి పాదాల నుంచి ముఖం వరకు మూలవిరాట్టును తాకడం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రతి ఏటా ఆ దృశ్యాన్ని కనులారా చూసేందుకు భక్తులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అరసవల్లి విచ్చేస్తారు.  ఉత్తరాయణంలో మార్చి 9, 10 తేదీలు, అలాగే దక్షిణాయనంలో అక్టోబరు 1, 2 తేదీల్లో స్వామివారి మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకుతాయి. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుని కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరతాయన భక్తుల నమ్మకం.