చైనా స్కూళ్లకు వెళ్తోన్న‌ పిల్లలు..కానీ వాళ్ల తలపై డీఐవై టోపీలు

| Edited By: Pardhasaradhi Peri

Apr 27, 2020 | 4:42 PM

పుట్టిన దేశం చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వ‌చ్చింది. ఇప్పుడు ఆ దేశం మెల్ల‌మెల్ల‌గా కార్య‌కలాపాల‌ను ప్రారంభిస్తోంది. తాజాగా స్కూళ్లు కూడా తెరుచుకుంటున్నాయి. అయితే కరోనా వైరస్‌ నేర్పిన గుణపాఠంతో ప్రివెన్ష‌న్ ఈజ్ బెట‌ర్ దెన్ క్యూర్ అనే మంత్రాన్ని జ‌పిస్తున్నారు అక్క‌డి జ‌నాలు. ముఖ్యంగా భౌతిక దూరం పాటించే విషయంలో ఆ కేర్ కాస్త ఎక్కువ‌గా ఉంది. అందుకే స్కూళ్లకు వచ్చే పిల్లలు ఒకరికొకరు ఆనుకోకుండా ఉండ‌టానికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని యాజమాన్యాలు […]

చైనా స్కూళ్లకు వెళ్తోన్న‌ పిల్లలు..కానీ వాళ్ల తలపై డీఐవై టోపీలు
Follow us on

పుట్టిన దేశం చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వ‌చ్చింది. ఇప్పుడు ఆ దేశం మెల్ల‌మెల్ల‌గా కార్య‌కలాపాల‌ను ప్రారంభిస్తోంది. తాజాగా స్కూళ్లు కూడా తెరుచుకుంటున్నాయి. అయితే కరోనా వైరస్‌ నేర్పిన గుణపాఠంతో ప్రివెన్ష‌న్ ఈజ్ బెట‌ర్ దెన్ క్యూర్ అనే మంత్రాన్ని జ‌పిస్తున్నారు అక్క‌డి జ‌నాలు. ముఖ్యంగా భౌతిక దూరం పాటించే విషయంలో ఆ కేర్ కాస్త ఎక్కువ‌గా ఉంది. అందుకే స్కూళ్లకు వచ్చే పిల్లలు ఒకరికొకరు ఆనుకోకుండా ఉండ‌టానికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని యాజమాన్యాలు రూల్స్ విధిస్తున్నాయి. దీంతో హాంగ్‌ఝౌ సిటీలోని ఓ స్కూలులో పిల్లలు భౌతిక‌ దూరం పాటించేలా ఉండేందుకు డీఐవై టోపీలను పెట్టుకుని క్లాసుల‌కు హాజరవుతున్నారు. మూడు అడుగుల పొడవుండే అట్టముక్కలు టోపీ రెండు చివర్ల అమరి ఉండటం వీటి స్పెషాలిటి.

పొడవాటి అట్టముక్కలు త‌ల చుట్టూ ఉండ‌టం వ‌ల్ల‌ పిల్లలు ఒకరికొకరు దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉండదు. కొంతమంది అట్లముక్కలకు బదులుగా పొడవాటి బెలూన్లను కూడా యూజ్ చేస్తున్నారు. స్కూలు యాజమాన్యాలు కూడా ఇలాంటి హెడ్జర్లపై స్పెష‌ల్ ఫోక‌స్ పెడుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా అయ్యాయి.