ఎల్‌జీ కంపెనీపై ఊహించని చ‌ర్య‌లు…మంత్రి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

|

May 13, 2020 | 10:01 PM

విశాఖపట్నం గ్యాస్ లీక్ దుర్ఘటనకు కారణమై..ఇంత‌మంది ప్ర‌జ‌ల‌ను ఇబ్బందిపెట్టిన‌ ఎల్‌జీ పాలిమ‌ర్స్ కంపెనీపై తీసుకోబోయే చ‌ర్య‌లు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉంటాయంటూ ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంపెనీ భ‌ద్రతాప‌రంగా స‌రైన‌ చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డ‌మే ఈ దుర్ఘట‌న‌కు కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ప‌ర్మ‌నెంట్ గా వైఎస్సార్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూసుకుంటామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. ఘ‌ట‌న‌కు సంబంధించి కొంద‌రు […]

ఎల్‌జీ కంపెనీపై ఊహించని చ‌ర్య‌లు...మంత్రి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
Follow us on

విశాఖపట్నం గ్యాస్ లీక్ దుర్ఘటనకు కారణమై..ఇంత‌మంది ప్ర‌జ‌ల‌ను ఇబ్బందిపెట్టిన‌ ఎల్‌జీ పాలిమ‌ర్స్ కంపెనీపై తీసుకోబోయే చ‌ర్య‌లు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉంటాయంటూ ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంపెనీ భ‌ద్రతాప‌రంగా స‌రైన‌ చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డ‌మే ఈ దుర్ఘట‌న‌కు కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ప‌ర్మ‌నెంట్ గా వైఎస్సార్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూసుకుంటామ‌ని మంత్రి హామీ ఇచ్చారు.

ఘ‌ట‌న‌కు సంబంధించి కొంద‌రు కావాల‌నే కుట్ర‌లు పన్నుతున్నార‌ని.. విశాఖ తప్పుడు ప్రచారాలను‌ నమ్మవద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ కోరారు. గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు, ఎంపీలు బస చేసినా.. కొంత‌మంది త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు య‌థాస్థితికి వ‌చ్చేవ‌ర‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని… స్వార్థ రాజ‌కీయాల‌తో వైజాగ్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీయొద్దని కోరారు.