నిర్మల వర్సెస్ వెలగపూడి: అసలేం జరిగింది?.. ఏం జరుగబోతోంది? సాగరనగరంలో ఎందుకీ పొలిటికల్ సునామీ?

|

Dec 26, 2020 | 1:51 PM

వైసీపీ నేత అక్కరమాని విజయనిర్మల ఇవాళ షిరిడీ సాయినాధుని ఫొటోపట్టుకొని విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి..

నిర్మల వర్సెస్ వెలగపూడి: అసలేం జరిగింది?.. ఏం జరుగబోతోంది? సాగరనగరంలో ఎందుకీ పొలిటికల్ సునామీ?
Follow us on

వైసీపీ నేత అక్కరమాని విజయనిర్మల ఇవాళ షిరిడీ సాయినాధుని ఫొటోపట్టుకొని విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఇంటికి వెళ్లారు. దీంతో సాగర నగరం విశాఖ ఎంవీపీ కాలనీలో ఒక్కసారిగా కోలాహల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో వెలగపూడి నివాసానికి 5 వందల మీటర్ల దూరం వరకూ పోలీసులు మోహరించారు. ముందుకువెళ్లకుండా నిర్మలను రోడ్డుపైనే పోలీసులు అడ్డుకున్నారు. చేసేదిలేక, అవినీతి చేయకపోతే వెలగపూడి బయటకు రావాలంటూ నిర్మల నినాదాలు చేశారు. 11 గంటలకు సమయమిచ్చి వెలగపూడి బయటకు రాలేదంటూ ఆమె ఎద్దేవా చేశారు. ఇదిలాఉంటే, దీనంతటికీ దారితీసిన పరిస్థితులేంటి? విశాఖపట్నం వైసీపీ, టీడీపీ నేతల మధ్య అసలేం జరిగింది? సవాళ్లు, ప్రతిసవాళ్లకు నేపథ్యం ఏంటి? చూద్దాం..

టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారంటూ అధికారులు ఇటీవల కూల్చివేతలకు దిగడం తెలిసిందే. దీంతో ఈ వివాదం మొదలైంది. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు భూ కబ్జా వ్యవహారం మీద స్పందించిన విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో టీడీపీ నేతల్ని టార్గెట్ చేశారు. చంద్రబాబు అండతో టీడీపీ నేతలు వేల కోట్ల విలువైన భూముల్ని అక్రమంగా దోచేశారంటూ ట్వీట్ చేశారు. ఆక్రమణదారుడు ఎంతటి వారైనా…ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు.

కట్ చేస్తే, పారదర్శకంగా దర్యాప్తు నిర్వహిస్తానని బాండు పేపర్‌పై రాసిస్తావా అంటూ కౌంటర్ విసిరారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి. గజం స్థలం ఆక్రమించానని నిరూపించినా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. నిరూపించలేకపోతే… విజయసాయిరెడ్డి తన రాజ్యసభ పదవీ కాలాన్ని వదులుకుంటారా అని ప్రశ్నించారు. తన పేరులోనే సాయి ఉన్న విజయసాయిరెడ్డి… తన ఆరోపణలపై నిజాయితీగా దర్యాప్తు చేయిస్తానని సాయిబాబా విగ్రహం దగ్గర బాండు పేపరుపై రాసివ్వగలరా అని సవాల్‌ చేశారు.

ఇక, వెలగపూడి రామకృష్ణ బాబు సవాల్‌పై స్పందించిన విజయసాయి రెడ్డి.. రాక్షసత్వం నిండిన వ్యక్తి దేవుడి మీద ప్రమాణం చేయమనటం ఏంటి? వినటానికే వెగటుగా ఉందని రియాక్టయ్యారు. అంతేనా, ‘తామంతా కలిసి చంపేసిన వంగవీటి మీద కూడా ప్రమాణం చేయగలడు, చంద్రబాబు వల్ల మరణించిన ఎన్టీఆర్ మీద ప్రమాణం చేయగలడు, తన భార్య-పిల్లల మీదైనా ప్రమాణం చేయగలడు’ అంటూ రామకృష్ణబాబుపై విజయసాయి వరుస సెటైర్లు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతకుమించి, వెలగపూడి బెజవాడలో వంగవీటి హత్య తర్వాత విశాఖ పారిపోయాడని ఎద్దేవా చేశారు విజయసాయి.  వెలగపూడి ఇక్కడ భూములు మేశాడు, పీకలు కోశాడని చాలామంది చెబుతున్నారని విజయసాయి అన్నారు. బినామీ భూములు లేకపోతే ఉలికిపాటు ఎందుకని నిలదీశారు వైసీపీ ఎంపీ. ఆస్తులన్నీ పోయినట్టు ఎందుకు బాధ? అంగుళం భూమి కూడా లేకపోతే బదులు తీర్చుకుంటానని ఎందుకు ప్రగల్బాలు? విశాఖలో ఆయన్ను ఎవరైనా ధర్మాత్ముడు అనుకుంటారా.. లేక.. ఒక గూండా, రౌడీ ఎలిమెంటుగా భావిస్తున్నారా.. అంటూ ప్రశ్నించారు విజయసాయి రెడ్డి.. వీటికి వెలగపూడే సమాధానం చెప్పాలంటూ ఆరోపణల పరంపర సాగించారు.

అయితే, ఈ క్రమంలో రామకృష్ణబాబు సవాల్‌పై వైసీపీ నేత విజయ నిర్మల.. నేను చాలంటూ ఎంటరయ్యారు. ప్రమాణానికి విజయసాయిరెడ్డి అవసరం లేదు.. తాను సిద్ధమంటూ సాయిబాబా ఫొటో పట్టుకొని నేరుగా ఈ ఉదయాన్నే సీన్ లోకి దిగిపోయారు. ప్రమాణం నీవు చేస్తావా.. నన్ను చేయమంటావా అంటూ ఈ ఉదయం వెలగపూడి ఆఫీస్‌కు వచ్చి క్లైమాక్స్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో వెలగపూడి రామకృష్ణ ఆఫీస్‌ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి అదుపు తప్పకుండా భద్రత ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సాగరనగరం ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెలగపూడి నివాసానికి అక్కరమాని నిర్మల చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం కనిపించింది. దీంతో ప్రశాంత విశాఖలో హైటెన్షన్‌ క్రియేట్ అయింది.   ఫొటోతో సీన్ లోకి దిగిపోయిన నిర్మల, ‘ఎమ్మెల్యే వెలగపూడీ.. నీ ఇంటికొచ్చా.. బయటకు రా.. నీ నట్టింట్లోకొస్తా’నంటూ తిష్ట

విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు భూ వివాదం, కొ౦డపోర౦బోకు స్థలమని ఆర్డీవో వివరణ