ధోనిలో జట్టును గెలిపించాలన్న ఉద్దేశమే లేదు…

|

May 27, 2020 | 3:59 PM

ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా వెర్సస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లోని పలు అంశాలను ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ త్వరలో ఆవిష్కరించనున్న ‘ఆన్ ఫైర్’ అనే పుస్తకంలో పేర్కొన్నాడు. ఆ సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల భాగస్వామ్యం ఆశ్చర్యపరిచిందని.. లక్ష్య చేధనలో ధోని అసలు జట్టును గెలిపించాలనే ఉద్దేశంతో ఆడలేదని వెల్లడించాడు. బర్మింగ్‌హమ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 337/7 పరుగులు చేయగా.. భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక […]

ధోనిలో జట్టును గెలిపించాలన్న ఉద్దేశమే లేదు...
Follow us on

ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా వెర్సస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లోని పలు అంశాలను ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ త్వరలో ఆవిష్కరించనున్న ‘ఆన్ ఫైర్’ అనే పుస్తకంలో పేర్కొన్నాడు. ఆ సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల భాగస్వామ్యం ఆశ్చర్యపరిచిందని.. లక్ష్య చేధనలో ధోని అసలు జట్టును గెలిపించాలనే ఉద్దేశంతో ఆడలేదని వెల్లడించాడు.

బర్మింగ్‌హమ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 337/7 పరుగులు చేయగా.. భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్న బౌండరీల గురించి మాట్లాడుతూ బ్యాట్స్‌మెన్‌ అందరూ కూడా రివర్స్ స్వీప్ షాట్స్ ఆడారని మాట్లాడాడు. ఇక దీనిపై స్టోక్స్‌ స్పందించి.. విరాట్ కామెంట్ చేసిన తీరు విచిత్రంగా ఉందని.. తన లైఫ్‌లోనే తాను విన్న అతి చెత్త ఆరోపణ అని అన్నాడు.

ఇదే మ్యాచ్‌లో ధోని చేసిన బ్యాటింగ్ గురించి కూడా స్టోక్స్‌ వివరించాడు. 11 ఓవర్లకు 112 పరుగులు అవసరమైనప్పుడు ధోని క్రీజులోకి వచ్చాడు. అయితే వచ్చిన దగ్గర నుంచి అతడికి జట్టును గెలిపించే ధ్యాసే లేదని.. సిక్సర్లకు బదులుగా సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడని తెలిపాడు. ఆఖరికి చివరిగా రెండు ఓవర్లలోనూ భారత్‌కు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నా కూడా ధోని గెలుపు కోసం ట్రై చేయలేదని స్టోక్స్‌ తన పుస్తకంలో రాశాడు.