ఆ దేశంలో మరో ఆరు రోజులపాటు వివాహాలు… అంత్యక్రియలు బంద్…కట్టుదిట్టమైన కట్టుబాటు

వివాహాలు, అంత్యక్రియలు, బహిరంగ వ్యాయామం, కుక్కలను బయటకు తీసుకురావడం.. ఇలా ప్రతి కదలికపై నిషేధం విధిస్తూ దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రం గురువారం నుంచి కఠినమైన లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది. ఆరు రోజులపాటు ఈ నిబంధనలు అమల్లో

ఆ దేశంలో మరో ఆరు రోజులపాటు వివాహాలు... అంత్యక్రియలు బంద్...కట్టుదిట్టమైన కట్టుబాటు

Updated on: Nov 20, 2020 | 12:01 AM

South Australia Lockdown : వివాహాలు, అంత్యక్రియలు, బహిరంగ వ్యాయామం, కుక్కలను బయటకు తీసుకురావడం.. ఇలా ప్రతి కదలికపై నిషేధం విధిస్తూ దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రం గురువారం నుంచి కఠినమైన లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది. ఆరు రోజులపాటు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రకటించింది. అత్యంత అవసరమైతే తప్ప ఒకరోజులో ప్రతి ఇంటి నుంచి ఒక్కరే బయటకు వెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది.

పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, రెస్టారెంట్లు అన్నీ మూసే ఉంచాలని, తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ప్రజలకు కచ్చితంగా చెప్పేసింది. కరోనా వైరస్ క్లస్టర్లను నియంత్రించాలనే లక్ష్యంతో కఠినంగా వ్యవహరిస్తున్నామని ఆ రాష్ట్ర ప్రీమియర్ వెల్లడించారు.  విదేశాల నుంచి వచ్చేవారిని స్వీయ నిర్బంధంలో ఉంచే సౌత్‌ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ హోటల్‌లో ఓ సహాయకుడు వైరస్ బారిన పడిన తరవాత మరో 23 మందికి అక్కడ వైరస్ సోకింది. దాంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలకు పూనుకున్నారు.