మరీ ఇంత దారుణమా..పసికందును పీక్కుతిన్న కుక్కలు

ఇది నిజంగా ఒళ్లు గగుర్పొడిచే వార్తే. మూడు నెలల పసికందును వీధికుక్కలు పీక్కు తిన్నాయి. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌ షహరన్‌పూర్‌లో జరిగింది. ఇవాళ ఉదయం స్ధానికంగా తలలేని శిశువు మృతదేహం కలకలం రేపింది. దీంతో ఆరాతీస్తే సోమవారం రాత్రి మూడు నెలల పసికందును లాక్కెళ్లి పీక్కు తిన్నట్టుగా తేలింది. బాలుని తల్లిదండ్రులు రాత్రి సమయంలో ఇంటి బయట నిద్రిస్తుండగా.. అక్కడికి వచ్చిన వీధి కుక్కలు పసికందును లాక్కెళ్లి పోయాయి. ఒక్కసారిగా బాలుడిపై వీధికుక్కలన్నీ ఎగబడటంతో ఆ […]

మరీ ఇంత దారుణమా..పసికందును పీక్కుతిన్న కుక్కలు

Updated on: Jun 25, 2019 | 6:42 PM

ఇది నిజంగా ఒళ్లు గగుర్పొడిచే వార్తే. మూడు నెలల పసికందును వీధికుక్కలు పీక్కు తిన్నాయి. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌ షహరన్‌పూర్‌లో జరిగింది. ఇవాళ ఉదయం స్ధానికంగా తలలేని శిశువు మృతదేహం కలకలం రేపింది. దీంతో ఆరాతీస్తే సోమవారం రాత్రి మూడు నెలల పసికందును లాక్కెళ్లి పీక్కు తిన్నట్టుగా తేలింది. బాలుని తల్లిదండ్రులు రాత్రి సమయంలో ఇంటి బయట నిద్రిస్తుండగా.. అక్కడికి వచ్చిన వీధి కుక్కలు పసికందును లాక్కెళ్లి పోయాయి. ఒక్కసారిగా బాలుడిపై వీధికుక్కలన్నీ ఎగబడటంతో ఆ చిన్నారి తల మొండెం వేరుపడ్డాయి. తలను తీసుకెళ్లిపోయిన కుక్కలు..మెండెంను దగ్గరలోని పొలంవద్ద వదిలి పారిపోయాయి. ఉదయం లేచిన కుటుంబ సభ్యులు పిల్లాడి కోసం చూసేసరికి పొలంలో తలలేని శరీరం కనిపించింది. ఇదిలా ఉంటే సీతాపూర్ జిల్లాలో గత ఏప్రిల్ నెలలో దాదాపు డజను మంది పిల్లల్ని కుక్కల చంపేశాయి. వీరంతా కుక్కల దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us