ఉభయదేవేరులతో శ్రీ మలయప్పస్వామి

తిరుమల శ్రీనివాసుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.. బ్రహ్మోత్సవాలలో కీలకమైన ఎనిమిదో రోజున, శనివారం ఉదయం ఆలయంలోని కళ్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు

ఉభయదేవేరులతో శ్రీ మలయప్పస్వామి

Edited By:

Updated on: Sep 26, 2020 | 11:21 AM

తిరుమల శ్రీనివాసుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.. బ్రహ్మోత్సవాలలో కీలకమైన ఎనిమిదో రోజున, శనివారం ఉదయం ఆలయంలోని కళ్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సర్వ భూపాల వాహనంపై భక్తులకు దర్శనమిస్తూ కనువిందు చేశారు.. అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అధికారులతో పాటు ఆలయసిబ్బంది పాల్గొన్నారు.. కరోనా వైరస్‌ కారణంగా ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు ఈసారి భక్తుల తాకిడి లేదు.. ఇదిలా ఉంటే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అక్టోబర్‌ కోటాను విడుదల చేసింది టీటీడీ. రోజుకు 13వేల టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.