కరోనా ఎఫెక్ట్: ఆ ఆలయంలో దర్శనాలు బంద్

| Edited By:

Jun 09, 2020 | 8:28 PM

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. లాక్ డౌన్ సడలింపులతో జూన్ 8 నుంచి దైవ దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని ఆలయాలు, మసీదులు, చర్చిల్లో భక్తులకు

కరోనా ఎఫెక్ట్: ఆ ఆలయంలో దర్శనాలు బంద్
Follow us on

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. లాక్ డౌన్ సడలింపులతో జూన్ 8 నుంచి దైవ దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని ఆలయాలు, మసీదులు, చర్చిల్లో భక్తులకు ప్రవేశాలు కల్పించారు. ఈ క్రమంలో ప్రార్థనా మందిరాల ప్రాంగణాలను సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుద్ధి చేశారు. అయితే రేపటి నుంచి శ్రీకాళహస్తి దేవాలయంలో దర్శనాలు ప్రారంభించడం లేదని ఆలయ ఈవో ప్రకటించారు. దేవాలయ అర్చకుడికి కరోనా పాజిటివ్ రావడంతో దర్శనాల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాక దర్శనాలు ప్రారంభిస్తామని ఈవో ప్రకటించారు.

Also Read: కరోనా వైరస్ లక్షణాలు లేనివారితో.. సంక్రమణం అరుదు..: ప్రపంచ ఆరోగ్య సంస్థ