శ్రీకాకుళంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌.. ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు.!

ఇవాళ శ్రీకాకుళంలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను జిల్లా కలెక్టర్ జె. నివాస్ అమలు చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు.

శ్రీకాకుళంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌.. ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు.!

Updated on: Sep 13, 2020 | 11:16 AM

Srikakulam Lockdown: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు అధికారులు పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ శ్రీకాకుళంలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను జిల్లా కలెక్టర్ జె. నివాస్ అమలు చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు.

Also Read: పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్…

జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను విధిస్తున్నామని.. ప్రజలు దీనికి సహకరించాలని ఆయన కోరారు. వైద్య సేవలకు, నిత్యావసరాలకు అనుమతి ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలకు రోడ్లపైకి రాకూడదని.. అలా కాదని వస్తే మాత్రమే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రపరిచుకోవాలన్నారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని.. ఉల్లంఘిస్తే మాత్రం క్రిమినల్ కేసులు పెడతామని జిల్లా కలెక్టర్ జె నివాస్ హెచ్చరించారు‌.