AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా విడదీసిన వృద్ధ దంపతులను ప్లాస్టిక్ షీట్‌ కలిపింది..!

కరోనా మహమ్మారి అయినవారినే కానివారిని చేస్తోంది. ఎంతో దగ్గరగా ఉన్నవారిని దరి చేరనివ్వడంలేదు. 59 ఏళ్లపాటు కలిసి ఉన్న ఓ వృద్ధ జంటను విడదీసింది మాయదారి కరోనా. చివరికి ఆస్పత్రి వారు ఏర్పాటు చేసిన ఫ్లాస్టిక్ తెర వారిని దగ్గర చేసింది.

కరోనా విడదీసిన వృద్ధ దంపతులను ప్లాస్టిక్ షీట్‌ కలిపింది..!
Balaraju Goud
| Edited By: |

Updated on: Jun 25, 2020 | 5:00 PM

Share

కరోనా మహమ్మారి అయినవారినే కానివారిని చేస్తోంది. ఎంతో దగ్గరగా ఉన్నవారిని దరి చేరనివ్వడంలేదు. 59 ఏళ్లపాటు కలిసి ఉన్న ఓ వృద్ధ జంటను విడదీసింది మాయదారి కరోనా. చివరికి ఆస్పత్రి వారు ఏర్పాటు చేసిన ఫ్లాస్టిక్ తెర వారిని దగ్గర చేసింది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య అంతరాన్ని పెంచింది కరోనా వైరస్. దంప‌తుల ఎడ‌బాటుకు కార‌ణంగా నిలిచింది. క‌రోనా వైరస్ భౌతిక దూరంతో బంధాలు, బంధుత్వాలను దూరం చేస్తోంది. కరోనా సోకి భార్య, భర్తలను ఎడబాటుకు గురిచేస్తోంది. అయితే స్పెయిన్ కి చెందిన నర్సింగ్ హోం కరోనా సోకిన దంపతులను దగ్గర చేస్తోంది. అక్క‌డి ప్లాస్టిక్ తెర‌లు వైర‌స్‌ల‌ను అడ్డుకుని, భార్యాభ‌ర్త‌ల‌ను క‌లుపుతున్నాయి. స్పెయిన్‌లో కరోనా వైరస్ విజృంభణ కోనసాగుతోంది. అగస్టినా కాసామెరో(81), పాస్కల్ పెరెజ్(83) దంపతులు కొవిడ్ పరీక్ష చేయించుకోగా.. 83 ఏళ్ల పాస్కల్ కొవిడ్ పాజిటివగా తేలింది. దీంతో అతడు స్థానిక బార్సిలోనాలోని ఒక నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ జంట వారి వైవాహిక జీవితంలో ఒకరినొక‌రు విడిచి ఎప్పుడూ దూరంగా ఉండ‌లేదు. కాని, లాక్ డౌన్ పుణ్యామాని ఆమె భర్తకు 102 రోజుల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో నర్సింగ్ హోం సిబ్బంది తమ అత్మీయులను వారు కలుసుకునేందుకు అవకాశం కల్పించారు. అగస్టినా ఈ అవకాశాన్ని వినియోగించుకుంది. ప్లాస్టిక్ షీట్ అడ్డుగా పెట్టి కలుసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఆ భార్యాభ‌ర్త‌లు ప్లాస్టిక్ షీట్ అడ్డుగా పెట్టుకుని కావ‌లించుకున్న క్ష‌ణాన‌‌ వారిలో ప్రేమ ఉప్పొంగింది. క‌రోనా భ‌యం క్ష‌ణాల్లో మ‌టుమాయ‌మైంది. ఇద్దరూ ఒకరినొకరు ఒక‌ నిమిషం పాటు ముద్దు పెట్టుకున్నారు. వారి భావోద్వేగాలకు ప్లాస్టిక్ షీట్ అడ్డుకాలేదు. ఈ విధంగా ఈ న‌ర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్న క‌రోనా బాధితులు ప్లాస్టిక్ షీట్ల మ‌ధ్య త‌మ ప్రియ‌త‌ముల‌ను క‌లుసుకుని, అంతులేని అప్యాయ‌త‌ను పొందుతున్నారు.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..