సీఎస్‌కే పరిస్థితిపై గంగూలీ ఏమన్నాడంటే..!

యూఏఈలో ఐపీఎల్ ప్రారంభం కాకముందే బీసీసీఐకి పెద్ద సవాల్ ఎదురైంది. చెన్నై జట్టులో ఇద్దరు బౌలర్లు సహా.. మొత్తం 13 మందికి కరోనా రావడం నిర్వాహకులను ఆందోళనకు గురి చేస్తోంది.

సీఎస్‌కే పరిస్థితిపై గంగూలీ ఏమన్నాడంటే..!

Updated on: Aug 31, 2020 | 5:40 PM

Sourav Ganguly Comments: యూఏఈలో ఐపీఎల్ ప్రారంభం కాకముందే బీసీసీఐకి పెద్ద సవాల్ ఎదురైంది. చెన్నై జట్టులో ఇద్దరు బౌలర్లు సహా.. మొత్తం 13 మందికి కరోనా రావడం నిర్వాహకులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇక ఈ ఘటనపై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ”సీఎస్కే పరిస్థితిపై నేనేం చెప్పలేను. షెడ్యూల్ ప్రకారం టోర్నీలోని మొదటి మ్యాచ్ ఆడుతుందా లేదా అనేది చూడాలి. ఐపీఎల్ సుదీర్ధమైంది, అంతా సాఫీగా జరుగుతుందని ఆశిస్తున్నా”.. అని గంగూలీ పేర్కొన్నాడు.

కాగా, యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరగనుంది. మొత్తం 54 రోజుల పాటు ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని టీమ్స్ యూఏఈ చేరుకొని.. ఆరు రోజుల క్వారంటైన్ కూడా పూర్తి చేశాయి.

Also Read: 

‘వైఎస్సార్ బీమా’ పధకం విధి విధానాలు.. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు.!

ఏపీ: 1036 గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా.!

”టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు”..

IPL 2020: ఒకే టీంలో కోహ్లీ, డివిలియర్స్, స్మిత్‌లు.. ఎప్పుడంటే..

సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్.. ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం.!