హైదరాబాద్(Hyderabad) లో బైక్ నడిపేవారు రెచ్చిపోతున్నారు. అతివేగం, వెకిలిచేష్టలు వంటి చర్యలతో ఇబ్బంది పెట్టిన కొందరు యువకులు.. ఇప్పుడు తప్పుడు నంబర్ ప్లేట్లతో ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పి తెప్పిస్తున్నారు. ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కేటాయించిన నంబర్ కాకుండా ఇతర వాహనాల నంబర్లతో యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. రవాణా శాఖ కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబరు బదులు ఇతరుల వాహనాల నంబర్లు అతికించుకుని దర్జాగా రోడ్ల మీద తిరుగుతున్నారు. వీరికి ట్రాఫిక్ పోలీసులు విధించే చలానాలు అసలైన వెహికిల్ నంబర్ కలిగిన వారికి వెళ్తున్నాయి. మోటారు వాహన చట్టం ప్రకారం వాహనానికి బోగస్ లేదా తప్పుడు నంబరు ప్లేట్లు వినియోగించడం చట్టరీత్యా నేరం. పోలీసులకు క్రిమినల్ కేసులు నమోదు చేసే అధికారమూ ఉంది. రవాణా శాఖ సహాయంతో వాహనాన్ని నడిపే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ఇలా ఇతర వాహనాల రిజిస్ట్రేషన్ నంబరు వినియోగించడం, అక్షరాలు గజిబిజిగా చేసినవి నగరంలో దాదాపు రెండు వేల వరకూ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అవి కూడా దాదాపు ద్విచక్ర వాహనాలే. తమ వాహన రిజిస్ట్రేషన్ నంబరును ఇతరుల వాహనాలకు వినియోగించినట్లు అనుమానం వస్తే తప్పనిసరిగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు సీసీ కెమెరాలు, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తప్పుడు నంబరు వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ఈ ఛలానా వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇదీ చదవండి
CM KCR: పల్లెలకు నేరుగా నిధులివ్వడం చిల్లర వ్యవహారం.. కేంద్రంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్..