వెండి ధరలో హెచ్చు, తగ్గులు నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం కిలో వెండి ధరపై రూ.30 పెరుగుదల నమోదైంది. కాగా, జనవరి 4న కిలో వెండిపై రూ.10 తగ్గింది. వారం రోజుల వ్యవధిలో గత ఏడాది డిసెంబర్ 29న రూ.200 పెరుగుదలను నమోదు చేసుకుంది. కాగా కొత్తేడాది కానుకగా జనవరి 1న దేశీయంగా కేజీ సిల్వర్ ధరలో రూ.300 తగ్గుదల నమోదైంది. నేడు తులం వెండి రూ.681.20గా పలుకుతోంది. ఒక గ్రాము వెండి రూ.68.12గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లోలో 10 గ్రాముల వెండి ధర రూ.681.20గా ఉంది. ఇక ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబైలోనూ రూ.681.20గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర 720, బెంగళూరులో తులం రూ.680గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 72,000గా ఉంది. కాగా, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రామల ధర రూ.720గా నమోదైంది.