అసలే.. డిసెంబర్ 31.. ఫుల్‌గా పార్టీ చేసుకోవాలి.. సిద్ధిపేట సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు.. ప్లాన్ వేశారు.. రైస్ మిల్లర్లు రెడీ అయిపోయారు.. సీన్ కట్ చేస్తే.. గోడౌన్స్ హౌస్‌నే బార్‌గా మార్చేశారు. మందు.. విందుతో రచ్చ రచ్చ చేశారు. బంతి భోజనాలు బెట్టి.. టేబుళ్లు వేసుకుని మరీ విందు చేసుకోవడం చూస్తే.. వీళ్ల ప్లానింగ్ ఎంత పర్‌ఫెక్ట్‌గా ఉందో అర్థమైపోతుంది. విషయం తెలుసుకుని మీడియా ఎంటర్ కావడంతో.. పరుగందుకున్నారు అధికారులు.