
Shruthi Hasan In Interview: సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లు ఎంచుకునే పాత్రల ఆధారంగానే వారి కెరీర్ ఏ స్థాయిలో ఉందో ఓ అంచనాకు వస్తుంటారు. అంతేకాకుండా హీరోయిన్‌గా ఓ స్థాయిలో ఉన్న సమయంలో తల్లి పాత్రల్లో నటించడానికి తారలు అంతగా ఆసక్తి చూపించరు. ఇది వారి తర్వాతి చిత్రాలపై ప్రభావం చూపుతుందనేది కొందరి భావన. అయితే తనకు మాత్రం అలాంటి ఆలోచనే రాలేదని చెబుతోంది అందాల తార శృతీ హాసన్.
నటుడు కమల్ హాసన్ నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ అందాల తార. తన మల్టీ ట్యాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది. గత కొన్ని రోజులుగా తెలుగు తెరకు పెద్దగా కనిపించలేదు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల పలకరించిన ఈ చిన్నది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శృతీ ఒక పాపకు తల్లిగా నటించింది. ఈ విషయమై ఓ ఇంటర్వూలో అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన శృతీ.. ‘నేను సినిమా కథ విన్నప్పుడు తల్లి పాత్ర చేయాలా..? వద్దా..? అనే ఆలోచన నాలో అస్సలు రాలేదు. ఏవో లెక్కలు వేసుకొని సినిమాలు చేయడం పాతకాలపు సిద్ధాంతం. నా కెరీర్ ఆరంభం నుంచి పాత్రల పరంగా ప్రయోగాలు, సవాళ్లకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. నేటి చిత్రసీమలో కొందరు హీరోయిన్లు పెళ్లయ్యాక కూడా విజయవంతంగా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. టాప్ హీరోయిన్లు తల్లి, భార్య పాత్రలు చేయకూడదనే ఆలోచనకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది’ అంటూ కుండబద్దలు కొట్టేలా చెప్పేసిందీ చిన్నది.
Also Read: Pawan Kalyan : ‘గోపాల గోపాల’ దర్శకుడితో మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా.. కానీ ఈసారి ఇలా…