
హైదరాబాద్ నగరంలో సినిమా టికెట్ ధరలు పెరిగాయి. మహర్షి సినిమా విడుదల నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు టికెట్ ధరలు పెంచాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 టికెట్ ధర రూ.110కి పెంచారు. మల్టీఫ్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో రూ.138 రూపాయలున్న ఒక్కో టికెట్ ధరను రూ.200లకు పెంచారు. ప్రభుత్వ అనుమతితో టికెట్ ధరలు పెంచినట్లు థియేటర్ యాజమాన్యాలు వెల్లడించాయి. పెంచిన టికెట్ ధరలు రెండు వారాలపాటు అమలు చేయనున్నారు.