రెండో టీ20లో మరో రికార్డు.. అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్​ హ్యాండర్ల జాబితాలోకి శిఖర్​ ధావన్​

|

Dec 06, 2020 | 7:59 PM

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమ్​ఇండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. సురేశ్​ రైనా పేరుతో ఉన్న రికార్డును ధావన్...

రెండో టీ20లో మరో రికార్డు.. అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్​ హ్యాండర్ల జాబితాలోకి శిఖర్​ ధావన్​
Follow us on

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమ్​ఇండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. సురేశ్​ రైనా పేరుతో ఉన్న రికార్డును ధావన్ బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్​మెన్ జాబితాలో టాప్‌లోకి చేరిపోయాడు.

ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్ ఈ  రికార్డును సొంతం చేసుకున్నాడు.​ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్ట్​హ్యాండ్​ బ్యాట్స్​మెన్ జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. ఇదివరకు ఈ రికార్డు మాజీ క్రికెటర్​​ సురేశ్​ రైనా పేరిట ఉండేది. ధావన్​ 52 పరుగుల వద్ద ఈ రికార్డును అధిగమించాడు.