భర్త కాంగ్రెస్ నుంచి.. భార్య ఎస్పీ నుంచి పోటీ..!

బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్న సిన్హా.. ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన భార్య పూనమ్ సిన్హా సమాజ్‌వాదీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ సమక్షంలో పూనమ్ సిన్హా సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. లక్నోలో రాజ్ నాథ్ సింగ్ ను ఎదుర్కొనడానికి పూనమ్ సిన్హాను ఎస్పీ – బీఎస్పీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దించనున్నట్లు తెలుస్తుంది. కాగా లక్నో లోక్‌సభ […]

భర్త కాంగ్రెస్ నుంచి.. భార్య ఎస్పీ నుంచి పోటీ..!
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 16, 2019 | 8:23 PM

బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్న సిన్హా.. ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన భార్య పూనమ్ సిన్హా సమాజ్‌వాదీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ సమక్షంలో పూనమ్ సిన్హా సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. లక్నోలో రాజ్ నాథ్ సింగ్ ను ఎదుర్కొనడానికి పూనమ్ సిన్హాను ఎస్పీ – బీఎస్పీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దించనున్నట్లు తెలుస్తుంది. కాగా లక్నో లోక్‌సభ నియోజకవర్గానికి రాజ్‌నాథ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.