Shashi Tharoor: కమల్ హాసన్ నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్ నేత… భారతీయుడు ఏం హామీ ఇచ్చాడంటే..?

మొన్నటి వరకు తమిళ రాజకీయం రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ చుట్టూ తిరగగా... తాజాగా ఎన్నికల హామీల చుట్టూ తిరుగుతోంది. కారణం తమిళనాట ఎన్నికల వేడి మొదలవడమే. సాధారణ ఎన్నికల..

Shashi Tharoor: కమల్ హాసన్ నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్ నేత... భారతీయుడు ఏం హామీ ఇచ్చాడంటే..?
Follow us

| Edited By:

Updated on: Jan 05, 2021 | 2:25 PM

మొన్నటి వరకు తమిళ రాజకీయం రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ చుట్టూ తిరగగా… తాజాగా ఎన్నికల హామీల చుట్టూ తిరుగుతోంది. కారణం తమిళనాట ఎన్నికల వేడి మొదలవడమే. సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పుడే ఎన్నికల హామీలను అధికార, ప్రతిపక్షాలు గుప్పిస్తున్నాయి. కాగా, తమిళనాట ఎన్నికల్లో హామీలే కీలక పాత్ర పోషిస్తాయని గత ఎన్నికల్లో రుజువైంది. తమిళ ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత పలు ఎన్నికల్లో వివిధ వాగ్ధానాలు, ఎన్నికల హామీలు ఇచ్చింది. అయితే వాటిలో ఎన్నికల హామీలే ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందాయి. అమ్మ బొమ్మతో ఫ్యాన్‌.. అమ్మ మిక్సీ.. అమ్మ గ్రైండర్‌.. అమ్మ ల్యాప్‌టాప్‌.. అమ్మ విత్తనాలు.. అమ్మ మందులు.. ఇలా సర్వం అమ్మ పేరుతో తమిళ ప్రజలకు అందించింది. అంతేకాకుండా పలు ఉచిత హామీలు తమిళ ప్రజలను ఆకట్టుకుంటాయి…

స్టాలిన్ విద్యా రుణాల మాఫీ…

డీఎంకే అధినేత, కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని విద్యార్థులు తీసుకున్న విద్యా రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించారు. తాజాగా కమల్ హాసన్ సైతం మహిళలపై వరాలు ప్రకటించాడు. దానిలో భాగంగా గృహిణులకు వేతనాలు చెల్లిస్తానని ప్రకటించాడు.

కాంగ్రెస్ నేత స్వాగతం…

తమిళనాట ఇంటి పని చేసే గృహిణులకు తమ ప్రభుత్వం వస్తే వేతనాలు ఇస్తామని ప్రకటించిన కమల్ హాసన్ హామీని కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యుడు శశిథరూర్ స్వాగతించారు. ఇంటి పనులు చేసే మహిళలకు వేతనాలు అందించడం అనేది గొప్ప నిర్ణయమని ట్వీట్ చేశాడు.

Also Read: CM Yogi Adityanath: ఘజియాబాద్‌ బాధితులకు సాయాన్ని ప్రకటించిన సీఎం యోగీ… మృతుల కుటుంబాలకు తలా పదిలక్షలు…

Latest Articles