లారీ ఢీకొని దంపతుల దుర్మరణం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని కొత్తూరు వద్ద బైక్ వెళ్తున్న భార్య భర్తలను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఫరూక్ నగర్ కు చెందిన చాపల ఆంజనేయులు(50), కళావతి (45) అక్కడికక్కడే మృతి చెందారు.

లారీ ఢీకొని దంపతుల దుర్మరణం

Updated on: Jun 20, 2020 | 6:00 PM

ఒక లారీ తప్పికునే క్రమంలో మరో లారీ కిందపడి దంపతులు దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని కొత్తూరు వద్ద బైక్ వెళ్తున్న భార్య భర్తలను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఫరూక్ నగర్ కు చెందిన చాపల ఆంజనేయులు(50), కళావతి (45) అక్కడికక్కడే మృతి చెందారు. నిత్యావసరాలు తెచ్చుకునేందుకు గూడూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా కొత్తూరు హనుమాన్ దేవాలయం వద్ద ఘటన చోటు చేసుకుంది. వెనకాల నుండి వేగంగా వస్తున్న లారీని తప్పించుకునే ప్రయత్నంలో అదుపుతప్పి దంపతులు క్రింద పడిపోయారు. అదే సమయంలో వెనక నుండి వచ్చిన మరో లారీ వారిపై నుండి వెళ్లడంతో భార్య భర్తలిద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us