రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటికి తీవ్రగాయాలు..

ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీకి రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రయాణిస్తూ ఉండగా, ఆమె కారు అదుపుతప్పి టిప్పర్‌కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె భర్త జావీద్‌ కూడా కారులోనే ఉన్నారు. డ్రైవర్‌కి కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే వారిని 108 వాహనంలో ఎంజీఎంకు తరలించారు. ప్రమాదం తీవ్రతకు కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది. “షబానా అజ్మీకి ముక్కుకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇప్పటివరకు బయలకు కనిపించే ఇతర గాయాలు […]

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటికి తీవ్రగాయాలు..

Updated on: Jan 18, 2020 | 6:25 PM

ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీకి రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రయాణిస్తూ ఉండగా, ఆమె కారు అదుపుతప్పి టిప్పర్‌కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె భర్త జావీద్‌ కూడా కారులోనే ఉన్నారు. డ్రైవర్‌కి కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే వారిని 108 వాహనంలో ఎంజీఎంకు తరలించారు. ప్రమాదం తీవ్రతకు కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది.

“షబానా అజ్మీకి ముక్కుకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇప్పటివరకు బయలకు కనిపించే ఇతర గాయాలు లేవు. ఆమె ప్రస్తుతం షాక్ స్థితిలో ఉన్నారు. చికిత్స జరుగుతోంది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది” అని ఎంజిఎం హాస్పిటల్ డాక్లర్లు తెలిపారు. షబానా తన భర్త, ప్రముఖ రచయిత  75వ పుట్టినరోజును శుక్రవారం రాత్రి ముంబైలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు.