లాభాల భాటలో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. జీవితకాల గరిష్టాల దిశగా.. నష్టాల్లో ప్రముఖ కంపెనీల షేర్లు.. 

|

Dec 09, 2020 | 11:12 AM

బుధవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.43 గంటల సంయంలో సెన్సెక్స్ 275 పాయింట్లు లాభపడి 45,888 దగ్గర కొనసాగుతుండగా..

లాభాల భాటలో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. జీవితకాల గరిష్టాల దిశగా.. నష్టాల్లో ప్రముఖ కంపెనీల షేర్లు.. 
Follow us on

Mumbai: బుధవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.43 గంటల సంయంలో సెన్సెక్స్ 275 పాయింట్లు లాభపడి 45,888 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 13,482 దగ్గరకు చేరింది. ప్రస్తుతం డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.73 దగ్గర కొనసాగుతుంది. ఈ రోజు మార్కెట్లు జీవితకాల గరిష్టాల దిశగా ప్రయానిస్తున్నాయి. కాగా అటు సెన్సెక్స్ 45,905కు చేరడంతోపాటు.. నిఫ్టీ కూడా అదే బాటలో ప్రయానిస్తుంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో త్వరలో సాధారణ పరిస్థితులు  ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలతో సూచీలు దూసుకెళ్తున్నాయి. దీనికి తోడు బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ షేర్లు రాణించడం సూచీలకు దన్నుగా నిలిచింది.

సన్ ఫార్మా, యూపీఎల్, ఐటీసీ లిమిటెడ్, హెచ్‏సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్, హెచ్డీఎఫ్‏సీ లైఫ్ ఇన్సూరెన్స్, మారుతీ సుజుకీ ఇండియా, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.