స్వల్పలాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

| Edited By:

May 22, 2019 | 4:22 PM

నేడు దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్పలాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 140 పాయింట్ల లాభంతో 39,110 వద్ద, నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 11,737 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దగ్గరపడటంతో మార్కెట్లలో కూడా ట్రేడింగ్‌ ఆచితూచి జరుగుతోంది. ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌, భారతీ ఎయిర్‌టెల్‌లు లాగా లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ సూచీలు పతనం అయ్యాయి. దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ షేర్లు 18శాతం పతనం అయ్యాయి. ఈ […]

స్వల్పలాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
Follow us on

నేడు దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్పలాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 140 పాయింట్ల లాభంతో 39,110 వద్ద, నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 11,737 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దగ్గరపడటంతో మార్కెట్లలో కూడా ట్రేడింగ్‌ ఆచితూచి జరుగుతోంది.

ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌, భారతీ ఎయిర్‌టెల్‌లు లాగా లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ సూచీలు పతనం అయ్యాయి. దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ షేర్లు 18శాతం పతనం అయ్యాయి. ఈ కంపెనీ కొత్తగా పబ్లిక్‌ డిపాజిట్లను స్వీకరించడాన్ని నిలిపివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. డిపాజిట్లను రెన్యూవల్‌ కూడా చేయడంలేదు. జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు 9శాతం పెరుగుదలతో వరుసగా మూడో రోజు కూడా లాభపడ్డాయి.