క్రేజ్ తగ్గని బుట్టబొమ్మ సాంగ్.. చిందేసిన మరో సీనియర్ హీరోయిన్

క్రేజ్ తగ్గని బుట్టబొమ్మ సాంగ్.. చిందేసిన మరో సీనియర్ హీరోయిన్

ఇప్పటికే ఈ సాంగ్‌కి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శిల్పా శెట్టి, దిశా పటాని, క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ఫిదా అయి టిక్‌టాక్‌లో ఈ పాటికి డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఈ పాటకి ఒకప్పటి సీనియర్ హీరోయిన్..

TV9 Telugu Digital Desk

| Edited By:

May 14, 2020 | 6:04 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమా ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్‌ అయి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. అందులోనూ ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా సామజవరగమన, బుట్టబొమ్మ, రాములో రాములో.. పాటలు సినిమాకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఈ సినిమా రిలీజ్ అయి ఐదు నెలలు అయినా ఇప్పటికీ ఈ బుట్టబొమ్మ సాంగ్‌కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికే ఈ సాంగ్‌కి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శిల్పా శెట్టి, దిశా పటాని, క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ఫిదా అయి డ్యాన్స్ చేశారు. ఆ వీడియోలను టిక్‌టాక్‌లో కూడా పోస్ట్ చేశారు.

ఇప్పుడు ఈ సాంగ్‌కి ఒకప్పటి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ సైతం స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఈ వీడియోను సిమ్రాన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘డ్యాన్స్ ఎప్పుడూ నన్ను ఉత్తేజపరుస్తుంది’ అని ట్వీట్ చేసింది.

Read More:

బిగ్ బ్రేకింగ్: జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!

లాక్‌డౌన్‌లో సైలెంట్‌గా.. ఓ ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్

గుడ్‌న్యూస్: అక్కడ విద్యార్థులకు టెన్త్ పరీక్షలు లేవు.. డైరెక్ట్ పాస్!

కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu