దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్ విధింపు

|

Oct 02, 2020 | 6:42 AM

దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్ విధిస్తూ ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్ విధింపు
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్ విధిస్తూ ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ 144 ప్రకారం ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకచోటకు చేరవద్దని ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఇండియా గేటు వద్ద ప్రజలను అనుమతించమని తెలిపారు. ఢిల్లీ వ్యాప్తంగా నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటాయని ఢిల్లీ డీసీపీ ట్వీట్ చేశారు. గత నెల 28వతేదీన 20 మంది పంజాబ్ యూత్ కాంగ్రెస్ సభ్యులు ఇండియా గేటు వద్ద రైతు బిల్లుకు వ్యతిరేకంగా ట్రాక్టరును దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన నేపథ్యంలో ముందస్తు చర్యలు పోలీసలు అంక్షలు విధించారు. అలాగే నగరంలో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఇండియా గేటు వద్ద సాయుధ పోలీసు పహరా కాస్తున్నారు.