పోలీసు పర్స్ లో చొరబడిన తూటా… అదే అతని ప్రాణదాత !

|

Dec 22, 2019 | 6:33 PM

యూపీలోని ఫిరోజాబాద్ లో ఓ పోలీసు కానిస్టేబుల్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు జరుగుతుండగా.. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసుల్లో ఒకరి బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ లో తూటా దిగబడింది. పైగా అది మరింత దూసుకువెళ్లి అతని జేబులోని పర్సులో చిక్కుకుపోయింది. విజేంద్ర కుమార్ అనే పోలీసుకు కలిగిన వింత అనుభవమిది.. నల్ బంద్ ప్రాంతంలో తాను డ్యూటీలో ఉండగా ఆందోళనకారుల్లో కొందరు తనపై కాల్పులు జరిపారని, ఒక తూటా […]

పోలీసు పర్స్ లో చొరబడిన తూటా... అదే అతని ప్రాణదాత !
Follow us on

యూపీలోని ఫిరోజాబాద్ లో ఓ పోలీసు కానిస్టేబుల్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు జరుగుతుండగా.. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసుల్లో ఒకరి బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ లో తూటా దిగబడింది. పైగా అది మరింత దూసుకువెళ్లి అతని జేబులోని పర్సులో చిక్కుకుపోయింది. విజేంద్ర కుమార్ అనే పోలీసుకు కలిగిన వింత అనుభవమిది.. నల్ బంద్ ప్రాంతంలో తాను డ్యూటీలో ఉండగా ఆందోళనకారుల్లో కొందరు తనపై కాల్పులు జరిపారని, ఒక తూటా తన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లో చొరబడడమే గాక.. తన జేబులోని పర్సులో చిక్కుకుపోయిందని ఆయన చెప్పాడు.

ఈ పర్సులో 4 ఏటీఎం కార్డులు, శివుడు, సాయిబాబాల ఫోటోలు ఉన్నాయని వెల్లడించాడు. ఆ బులెట్ ఒకవేళ పర్సును కూడా ఛేదించుకుని నా ఛాతీలోకి దూసుకు వఛ్చి ఉంటే నాకు ప్రాణాపాయం కలిగి ఉండేదని, కానీ ఎలాంటి గాయాలకు గురికాని ఇది నాకు  పునర్జన్మే అని విజేంద్ర కుమార్ పేర్కొన్నాడు. నిరసన ప్రదర్శనల సందర్భంగా ఆందోళనకారుల్లో కొందరు నాటు తుపాకులతో పోలీసులపై కాల్పులకు పాల్పడుతున్నారని ఆయన చెప్పాడు. ఆయా స్థలాల వద్ద తాము 405 బులెట్ షెల్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు విజేంద్ర కుమార్ తెలిపాడు. కాగా-యూపీలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఘర్షణలు, అల్లర్లలో 263 మంది పోలీసులు గాయపడ్డారు. వీరిలో 57 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి.