డిఫాల్టర్స్‌కు ఎస్‌బీఐ వార్నింగ్

ఢిల్లీ: భారీగా లోన్లు తీసుకుని ఎగవేత ధోరణిని అవలంభిస్తున్న పలవురు బడా వ్యాపారవేత్తలపై ఎస్‌బీఐ ద‌ృష్టి సారించింది. త్వరలో వారిపై కొరడా ఝులిపించేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సిద్దమైంది. ఫార్మా, వజ్రాల వ్యాపారం, విద్యుత్‌ రంగాలకు చెందిన 10 మంది ఢిపాల్టర్స్ పేర్లను బయటకు వెల్లడించింది. వీరంతా 15 రోజుల్లోగా వడ్డీతో సహా అప్పులు కట్టాలని.. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ పది మంది ఎస్‌బీఐ నుంచి దాదాపు రూ. 1500కోట్ల వరకూ […]

డిఫాల్టర్స్‌కు ఎస్‌బీఐ వార్నింగ్

Updated on: Jun 29, 2019 | 1:04 AM

ఢిల్లీ: భారీగా లోన్లు తీసుకుని ఎగవేత ధోరణిని అవలంభిస్తున్న పలవురు బడా వ్యాపారవేత్తలపై ఎస్‌బీఐ ద‌ృష్టి సారించింది. త్వరలో వారిపై కొరడా ఝులిపించేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సిద్దమైంది. ఫార్మా, వజ్రాల వ్యాపారం, విద్యుత్‌ రంగాలకు చెందిన 10 మంది ఢిపాల్టర్స్ పేర్లను బయటకు వెల్లడించింది. వీరంతా 15 రోజుల్లోగా వడ్డీతో సహా అప్పులు కట్టాలని.. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఈ పది మంది ఎస్‌బీఐ నుంచి దాదాపు రూ. 1500కోట్ల వరకూ లోన్లు తీసుకున్నారట. వాటిని చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో వారిని విల్‌ఫుల్ డిఫాల్టర్స్ జాబితాలో చేర్చింది. తాజాగా వారి పేర్లను ఓ పబ్లిక్‌ నోటీసు ద్వారా వెల్లడించింది. ముంబయికి చెందిన స్పాన్కో లిమిటెడ్‌ కంపెనీ తాజా జాబితాలో అతిపెద్ద ఎగవేతదారుగా ఉంది. ఈ కంపెనీ ఎస్‌బీఐకు రూ. 347కోట్లు బకాయి పడింది.

Follow Us