ఎస్‌బీఐ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్..

|

Sep 13, 2020 | 7:33 PM

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎస్‌బీఐ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్..
Follow us on

SBI New Fixed Deposit Rates: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా సవరించిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 10 నుంచే అమలులోకి వచ్చినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఏడాది నుంచి రెండేళ్లలోపు చేసుకునే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 0.20 శాతం మేరకు వడ్డీ రేటును తగ్గించింది. ఇక గతంలో 1-2 ఏళ్ల ఎఫ్‌డీలపై 5.10 శాతం వడ్డీ రేటు ఉండగా.. ఇప్పుడు దాన్ని 4.90 శాతానికి పరిమితం చేసింది. అలాగే సీనియర్ సిటిజన్ల విషయంలోనూ వడ్డీ రేటును 5.60 శాతం నుంచి 5.40 శాతానికి తగ్గించింది.