Sasikala Discharged :శశికళ విక్టోరియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. బెంగళూరులోనే విశ్రాంతి తీసుకునే అవకాశం

|

Jan 31, 2021 | 1:47 PM

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన ఏఐఏడీఎంకే బహిష్కృత నేత దివంగత సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ ఆసుపత్రి నుంచి ఈరోజు విక్టోరియా ఆసుపత్రి నుండి..

Sasikala Discharged :శశికళ విక్టోరియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..  బెంగళూరులోనే విశ్రాంతి తీసుకునే అవకాశం
Follow us on

Sasikala Discharged : అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన ఏఐఏడీఎంకే బహిష్కృత నేత దివంగత సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ ఆసుపత్రి నుంచి ఈరోజు విక్టోరియా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆమె శిక్షా కాలం ముగియ‌డంతో ఇటీవ‌లే ఆమె విడుదలయ్యారు. శ‌శిక‌ళ‌ ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉండ‌డంతో ఆస్పత్రి సిబ్బంది ఈరోజు ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఆమెను బెంగళూరులోని నంది హిల్స్ సమీపంలో ఉన్న ఒక ఉన్నతస్థాయి ప్రైవేట్ రిసార్ట్ కు తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం.

శశికళకు పదిరోజుల చికిత్స పూర్తయిందని బెంగ‌ళూరు వైద్య కళాశాల ఆసుప‌త్రి చెప్పింది. ఆమెకు ఎలాంటి క‌రోనా‌ లక్షణాలు లేవని, మూడు రోజులుగా ఆక్సిజన్‌ లేకుండా శ్వాస తీసుకోగలుగుతున్నారని తెలిపింది. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆమె ఆదివారం చెన్నైకి వెళ్లడానికి ఇష్టపడలేదని తెలుస్తుంది. సోమవారం బెంగళూరు నుండి బయలుదేరే అవకాశం ఉందని సమాచారం. త్వరలో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో చిన్నమ్మ విడుద‌లవుతుండ‌డంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారే అవ‌కాశాలున్నాయని టాక్

Also Read: గరుత్మంతుని విగ్రహంపై చెమట పడుతూ సైన్స్ కే సవాల్ విసురుతున్న క్షేత్రం ఎక్కడుందో తెలుసా..!