పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహారశైలి చాలా వివాదాస్పదంగా ఉంటుంది. అతడు చేసే పనులు, చేష్టలు చర్చనీయాంశమవుతూ ఉంటాయి. తాజాగా అంపైర్‌ని దూషించి వార్తల్లోకి ఎక్కాడు సర్ఫరాజ్. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు అతడి మ్యాచ్ ఫీజులో 35 శాతం కోత విధించింది. క్వైద్-ఈ- ఆజామ్ ట్రోఫీలోని ఓ మ్యాచ్లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టి.. అతడిని దూషించాడమే ఇందుకు కారణమని బోర్డు పేర్కొంది. సింధ్ ఫస్ట్ ఎలెవన్ జట్టుకు సారథిగా ఉన్న సర్ఫరాజ్.. శనివారం జరిగిన మ్యాచ్లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించాడు.
“అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సర్ఫరాజ్.. పలుమార్లు అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. అంపైర్లుగా ఉన్న ఫైజల్ అఫ్రిది, సకిబ్ ఖాన్ పాకిస్థాన్ బోర్డుకు కంప్లైంట్ చేశారు. బోర్డు నియమావళిలోని ఆర్టికల్ 2.21 ప్రకారం సర్ఫరాజ్ నిబంధనలు అతిక్రమించాడు” అని పీసీబీ వెల్లడించింది.
Also Read :
దిండు కింద ఫోన్ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు