Sania Mirza: సొంత గడ్డపై గ్రాండ్ గా ఫేర్ వెల్ .. నేడు ఎల్బీ స్టేడియంలో సానియా మీర్జా లాస్ట్ మ్యాచ్!

|

Mar 05, 2023 | 6:39 AM

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇవాళ హైదరాబాద్‌లో ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆమె...చివరిమ్యాచ్‌ తన హోమ్‌టౌన్‌లో అభిమానుల కోసం ఆడబోతుంది.

Sania Mirza: సొంత గడ్డపై గ్రాండ్ గా ఫేర్ వెల్ .. నేడు ఎల్బీ స్టేడియంలో సానియా మీర్జా లాస్ట్ మ్యాచ్!
Sania Mirza Today Last Matc
Follow us on

ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పటికే తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే టెన్నిస్ ఓనమాలు నేర్చుకున్న హైదరాబాద్‌ లో తన లాస్ట్ మ్యాచ్ ఆడాలని ఆశించిన సానియా మీర్జా అభిమానుల కోసం ఇవాళ ఎల్బీ స్టేడియం‌లో ఫేర్‌‌వెల్ మ్యాచ్‌ ఆడనుంది. దీంతో హైదరాబాద్‌లోని అభిమానులు సానియా మీర్జా లాస్ట్ మ్యాచ్‌ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మార్నింగ్‌ 10 గంటలకు ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో తనకి ఉన్న అనుబంధం గురించి సానియా మీర్జా గుర్తుచేసుకున్నారు. ఇకపై ఫ్యామిలీ కోసం ఎక్కువ సమయం కేటాయించబోతున్నట్లు ఆమె చెప్పారు. 2003లో టెన్నిస్‌ కెరీర్ స్టార్ట్ చేసిన సానియా మీర్జా.. దాదాపు 20 ఏళ్లు ఆటలో కొనసాగింది. ఫిబ్రవరి 21న దుబాయ్‌లో జరిగిన టోర్నీలో ఫస్ట్ రౌండ్‌లోనే ఓటమి పాలైన సానియా మీర్జా.. టెన్నిస్‌కి గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు ఆస్ట్రేలియా ఓపెన్‌లో పోటీపడిన సానియా మీర్జా రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

సానియా మీర్జా తన కెరీర్‌లో మొత్తం ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచింది. మార్టినా హింగిస్‌తో కలిసి మూడు ఉమెన్స్ డబుల్ టైటిల్స్ గెలిచింది. మరో మూడు మిక్స్‌డ్ డబుల్స్‌లో టైటిల్స్ కైవసం చేసుకుంది. ఇందులో రెండు మహేష్ భూపతితో కలిసి సాధించింది. ఆసియా క్రీడల్లో 8 పతకాలు గెలిచిన సానియా మీర్జా.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో కూడా రెండు పతకాలు సాధించింది. ఒలింపిక్స్ పతకం కోసం శ్రమించినా అది కలగానే మిగిలింది. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచింది సానియా మీర్జా.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..