పూజా హెగ్డే కామెంట్స్‌పై స్పందించిన సమంత

ఇద్దరు టాలీవుడ్‌ బామల మధ్య రేగిన వివాదం ఇంకా రాజుకుంటూనే ఉంది. పూజా హెగ్డే త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో.. స‌మంత అక్కినేని అందంపై నెగెటివ్ కామెంట్ చేయ‌టంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. దీంతో వెంటనే స్పందించిన పూజా.. త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింద‌ని ప్రకటించింది. అయితే అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఇది స‌మంత అభిమానుల‌కు ఆగ్ర‌హం తెప్పించింది. అకౌంట్ హ్యాక్ అయ్యింద‌ని పూజా వివ‌ర‌ణ ఇచ్చినా ఫ్యాన్స్ అవేం ప‌ట్టించుకోలేదు. వెంట‌నే స‌మంత‌కు […]

పూజా హెగ్డే కామెంట్స్‌పై స్పందించిన సమంత

Updated on: May 30, 2020 | 1:22 PM

ఇద్దరు టాలీవుడ్‌ బామల మధ్య రేగిన వివాదం ఇంకా రాజుకుంటూనే ఉంది. పూజా హెగ్డే త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో.. స‌మంత అక్కినేని అందంపై నెగెటివ్ కామెంట్ చేయ‌టంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. దీంతో వెంటనే స్పందించిన పూజా.. త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింద‌ని ప్రకటించింది. అయితే అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఇది స‌మంత అభిమానుల‌కు ఆగ్ర‌హం తెప్పించింది. అకౌంట్ హ్యాక్ అయ్యింద‌ని పూజా వివ‌ర‌ణ ఇచ్చినా ఫ్యాన్స్ అవేం ప‌ట్టించుకోలేదు. వెంట‌నే స‌మంత‌కు సారీ చెప్పాలంటూ పెద్ద ఎత్తున ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ చేశారు. అయిన‌ప్ప‌టికీ దీనిపై పూజా హెగ్డే స్పందించ‌లేదు. అయితే పూజా పోస్ట్‌ని సెల‌బ్రిటీలు కూడా త‌ప్పు ప‌ట్టారు. తాజాగా స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో.. ‘మంచి మ‌న‌సులు క‌లిగిన వారిని ఎదుటి వ్య‌క్తులు తెలివిత‌క్కువ వారిగా చూస్తార‌ని’ పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ పూజా హెగ్డేని ఉద్దేశించే అని నెటిజ‌న్స్ అనుకుంటున్నారు. సమంత పెట్టిన పోస్ట్ మంచి స్పందన వస్తోంది.