ఫ్యాన్ ఇచ్చిన షాక్‌కి అవాక్కయిన సమంత..

| Edited By:

Jun 01, 2020 | 12:51 PM

ఓ నెటిజన్ సమంతకే షాక్ ఇచ్చాడు. అది తెలుసుకుని ఆమె ఒక్కసారిగా అవాక్కయింది. 'ఓ నెటిజన్.. సమంతకి సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్‌తో పాటు సామ్ కూడా షాక్‌ అయింది. వెంటనే ఆ నెటిజన్‌కి రిప్లై...

ఫ్యాన్ ఇచ్చిన షాక్‌కి అవాక్కయిన సమంత..
Follow us on

కరోనా లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమయ్యింది అక్కినేని కోడలు సమంత. అలాగే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. తన ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి విశేషమైనా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది సామ్. ఆమెకు సంబంధించిన ఏ పోస్ట్ అయినా కొద్ది నిమిషాల్లోనే వైరల్ అవుతుంది. కాగా ఇటీవలే సమంత టెన్త్ మార్కుల మెమో నెట్టింట హల్‌చల్ అయిన విషయం తెలిసిందే కదా. స్కూల్, కాలేజీలో ఇచ్చిన ప్రొగ్రెస్ రిపోర్టులు అందరినీ షాక్‌కి గురి చేశాయి.

సీఎస్‌ఐ సెయింట్‌ స్టీఫెన్‌ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో సమంతకు పదో తరగతిలో గణితం-పార్ట్‌-1 లో 100కు 100 మార్కులు రాగా.. గణితం పార్టు-2లో 99 మార్కులు రావడం విశేషం. ఇంగ్లీష్‌లో 90 మార్కులు వచ్చాయి. మిగతా సబ్జెక్టుల్లో కూడా మంచి మార్కులు వచ్చాయి. అలాగే హోలీ ఎంజెల్స్‌ ఆంగ్లో ఇండియన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో 11వ తరగతిలో కూడా సబ్జెక్టులా వారిగా మంచి ప్రతిభను కనబర్చింది సామ్.

అయితే ఈ క్రమంలోనే ఓ నెటిజన్ సమంతకే షాక్ ఇచ్చాడు. అది తెలుసుకుని ఆమె ఒక్కసారిగా అవాక్కయింది. ‘ఓ నెటిజన్.. సమంతకి సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్‌తో పాటు సామ్ కూడా షాక్‌ అయింది. వెంటనే ఆ నెటిజన్‌కి రిప్లై ఇచ్చింది. ఇది నీకు ఎలా వచ్చిందని ప్రశ్నించింది. అయితే సామ్ ప్రశ్నకి బదులివ్వని ఆ నెటిజన్ వెంటనే ఆ పోస్ట్‌ని డిలీట్ చేశాడు’. కానీ అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి:

బ్రేకింగ్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతలకు కరోనా పాజిటివ్

ఒకటో తేదీ ఝలక్.. పెరిగిన గ్యాస్ ధరలు..

దేశవ్యాప్తంగా ప్రారంభమైన రైళ్లు.. 4 నెలలకు రిజర్వేషన్..

రైతులకు కేంద్రం అందించే బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఇదే!