డెన్మార్క్‌ ఓపెన్‌ నుంచి సైనా, కశ్యప్ ఔట్..!

భారత బ్యాడ్మింటన్‌ జంట సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌ డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌ నుంచి వైదొలిగినట్లు మంగళవారం ప్రకటించారు.

డెన్మార్క్‌ ఓపెన్‌ నుంచి సైనా, కశ్యప్ ఔట్..!

Updated on: Oct 06, 2020 | 6:44 PM

భారత బ్యాడ్మింటన్‌ జంట సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌ డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌ నుంచి వైదొలిగినట్లు మంగళవారం ప్రకటించారు. అక్టోబరు 13 నుంచి 18 వరకు ఓడెన్స్‌లో డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరగనుంది. డెన్మార్క్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్నాను. వచ్చే జనవరిలో ఆసియన్‌ టూర్‌తో సీజన్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నానని సైనా చెప్పారు.

మరోవైపు ప్రపంచ 24వ ర్యాంకు ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ కూడా ఈ టోర్నమెంట్ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఒక్క టోర్నమెంట్‌ కోసం అంత రిస్క్‌ తీసుకోవడం మంచిది కాదని భావిస్తున్నాను. జనవరిలో ఆసియా టోర్నీలో పాల్గొనాల్సి ఉన్నందున ఈ సీజన్‌ను కొత్తగా ఆరంభించాలనుకుంటున్నట్లు వివరించారు. ఇక, మాజీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ ప్లేయర్‌ కిదాంబి శ్రీకాంత్‌, యువ షట్లర్‌ లక్ష్యసేన్‌, అజయ్‌ జయరాం, శుభంకర్‌ మాత్రమే భారత్‌ నుంచి డెన్మార్క్‌ ఓపెన్‌ బరిలో దిగుతున్నారు. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనకూడదని సింధు నిర్ణయించుకుంది.