Sachin Comments On Dhoni: 2007 టీ20 వరల్డ్ కప్ సమయంలో భారత్ జట్టుకు తదుపరి కెప్టెన్ ఎవరైతే బాగుటుందని బీసీసీఐ పెద్దలు తనను అడిగితే.. ధోని పేరును సిఫార్సు చేసానని సచిన్ టెండూల్కర్ తాజాగా వెల్లడించాడు. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేసేటప్పుడు ధోనితో మ్యాచ్ పరిస్థితులపై విశ్లేషించేవాడని.. ఆ సమయంలో అతడు ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకునేవాడినని సచిన్ తెలిపాడు. ధోనికి క్రికెట్‌పై మంచి పట్టు ఉందని అర్ధమైంది అందుకే బీసీసీఐ పెద్దలకు నెక్స్ట్ కెప్టెన్‌గా ధోని అయితేనే బాగుంటుందని చెప్పానన్నాడు.
కాగా, ధోని ఆగష్టు 15వ తేదీన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన ధోని.. 1983 తర్వాత ఇండియాకు వన్డే ప్రపంచకప్ సాధించడమే కాకుండా.. 2007లో టీ20 వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ధోని కెప్టెన్సీలోనే భారత్ గెలుచుకుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు వెన్నంటే ఉండి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. వన్డేలు, టీ20లు ఆడుతూ 2015 ప్రపంచకప్, 2016 టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ వరకు.. అలాగే 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ వరకు జట్టును నడిపించాడు. అటు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో కూడా భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాడు.
Also Read:
తెలంగాణలో విస్తరిస్తున్న కొత్త వైరస్.. ఆందోళనలో రైతులు..