Sachin Tendulkar: దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమం రోజురోజుకి తీవ్రమవుతుంది. రైతుల ఉద్యమం అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల పాప్ సింగర్ రిహానా చేసిన ట్వీట్ అంతర్జాతీయంగా చర్చగా మారింది. బాధ్యతారాహిత్యమైన ట్వీట్లు అంటూ భారత్ కౌంటర్ ఇచ్చింది. రైతుల ఉద్యమం ప్రస్తుతం బాలీవుడ్ సెలబ్రెటీలను తాకింది. రైతుల ఉద్యమానికి కొందరు సెలబ్రెటీలు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు. బాలీవుడ్ అగ్రహీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్ సైతం ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. తాజాగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా రైతుల ఉద్యమంపై స్పందించారు.
“మనమంతా సమైక్యంగా ఉండాలి. భారత దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించకూడదు. బయటి శక్తులు కేవలం ప్రేక్షకులుగానే ఉండాలి. మన దేశ వ్యవహారాల్లో భాగస్వాములు కాకుడదు..” అంటూ తన ట్విట్టర్లో షేర్ చేశాడు సచిన్. మన దేశం గురించి భారతీయులకు తెలుసు.. మన దేశం కోసం ఏ నిర్ణయమైనా భారతీయులే తీసుకోవాలని సచిన్ తెలిపాడు. పాప్ సింగర్ రిహన్నా చేసిన ట్వీట్ అంతర్జాతీయంగా చర్చకు తెరతీయగా.. పలువురు సెలబ్రెటిలు చేసిన ట్వీట్లతో రైతులకు మద్దతు పెరిగింది. కానీ తమ వ్యవహారాలపై స్పందించాల్సిన అవసరం లేదని.. కొందరు బాధ్యతారాహిత్యమైన ట్వీట్లు చేస్తున్నారని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే పాప్ సింగర్ రిహానాకు ట్విట్టర్ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు.
India’s sovereignty cannot be compromised. External forces can be spectators but not participants.
Indians know India and should decide for India. Let’s remain united as a nation.#IndiaTogether #IndiaAgainstPropaganda— Sachin Tendulkar (@sachin_rt) February 3, 2021
Also Read:
115 మంది ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు.. మిగతా వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తాం: అరవింద్ కేజ్రీవాల్