
Saaho Director Next Movie: ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడుగా పరిచయమైన సుజీత్.. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘సాహో’ సినిమా తెరకెక్కించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ సాధించింది. అంతేకాక సుజీత్ హాలీవుడ్ స్టైల్ టేకింగ్‌కు విమర్శకుల దగ్గర నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ మూవీ తర్వాత సుజీత్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అతడి నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో సుజీత్ త్వరలోనే ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ రూపొందించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్తపై అటు దర్శకుడు గానీ.. ఇటు నిర్మాణ సంస్థ గానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు.