చెత్త ఏరుకుంటూ జీవనం : ఇంట్లో బిందెల నిండా చిల్ల‌ర నాణేలే !

|

Aug 14, 2020 | 5:40 PM

తమిళనాడులో చెత్త ఏరుకుని జీవ‌నం సాగించే వారింట్లో దాదాపు రూ.2 లక్షలు విలువ చేసే చిల్లర నాణేలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

చెత్త ఏరుకుంటూ జీవనం : ఇంట్లో బిందెల నిండా చిల్ల‌ర నాణేలే !
Follow us on

తమిళనాడులో చెత్త ఏరుకుని జీవ‌నం సాగించే వారింట్లో దాదాపు రూ.2 లక్షలు విలువ చేసే చిల్లర నాణేలు బ‌య‌ట‌ప‌డ్డాయి. రూ.40 వేలు విలువైన ర‌ద్దు చేసిన‌ నోట్లు, బంగారమూ లభ్య‌మ‌య్యాయి‌.

వివ‌రాల్లోకి వెళ్తే.. చెన్నై, ఒట్టేరి, సత్యవాణిముత్తు నగర్​ ప్రాంతాల‌కు చెందిన విజయలక్ష్మి (60), రాజేశ్వరి (65), ప్రభావతి (57)లకు ఇల్లు ఉన్నా..చెత్త ఏరుకుంటూ రోడ్డు పక్కనే నివ‌శిస్తున్నారు. వీరు ఎందుకు అక్క‌డ నివ‌శిస్తున్నారో తెలుసుకోడానికి ఇటీవ‌ల లోక‌ల్ పోలీసులు వారి ఇంటిని తనిఖీ చేశారు. ఈ త‌నిఖీల్లో ప్లాస్టిక్ బిందెల్లో నింపిన చిల్లర నాణేలు, ఏడు సవర్ల బంగారం, రూ. 40 వేలు విలువ చేసే రద్దయిన 500, 1000 రూపాయల పాత నోట్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇవి చూసి ఇరుగుపొరుగువారు షాక్ అయ్యారు.

 

Also Read : ఏపీ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ : ఈ నెలలో ఒకేసారి 90 గుడ్లు పంపిణీ