Corona Time : 800 మంది అతిథులతో పెళ్లి వేడుకలు.. రూ.లక్ష ఫైన్

|

Nov 01, 2020 | 6:22 PM

కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. కొంతమంది ప్రజలు ఈ వైరస్‌ను లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ ప్రారంభమైంది.

Corona Time :  800 మంది అతిథులతో పెళ్లి వేడుకలు.. రూ.లక్ష ఫైన్
Follow us on

కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. కొంతమంది ప్రజలు ఈ వైరస్‌ను లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ ప్రారంభమైంది. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఈ క్రమంలో ఒడిశాలోని దేవ్​గఢ్​లో ఓ వ్యక్తి భారీ జన సందేహం మధ్య తన తనయుడి పెళ్లి వేడుకను నిర్వహించాడు. దీంతో సీరియస్ అయిన అధికారులు..అతడికి లక్ష రూపాయల జరిమానా విధించారు.

వివరాల్లోకి వెళ్తే…దేవ్​గఢ్​లోని కమలా బాగిచా గ్రామానికి చెందిన వన్​ కులన్​ టోప్నో.. తన తనయుడు అమిత్​ టోప్నోస్​ పెళ్లి వేడుకలను నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి 800 మంది గెస్టులు హాజరయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్​ పల్లవి నాయక్, స్థానిక పోలీసులు..​ పెళ్లి మండపానికి చేరుకున్నారు. కొవిడ్​ నిబంధనలను అతిక్రమించింనందుకు వరుడి తండ్రికి రూ.లక్ష జరిమానా విధించారు.

 

Also Read :

వైభవంగా సిరివెన్నెల తనయుడి వివాహం

అదే ప్రేమను కొనసాగించాల్సింది నోయల్ !