ఈ సీజన్ లో​ బెన్​ స్టోక్స్​ ఆడటం కష్టమే !

|

Sep 16, 2020 | 3:13 PM

ప్రజంట్ ఐపీఎల్​ సీజన్​లో రాజస్థాన్​ రాయల్స్​ ప్లేయర్​ బెన్​ స్టోక్స్​ ఆడే విషయమై ఇంకా క్లారిటీ లేదని ఆ జట్టు కోచ్ మెక్​డొనాల్డ్​ అన్నారు.

ఈ సీజన్ లో​ బెన్​ స్టోక్స్​ ఆడటం కష్టమే !
Follow us on

ప్రజంట్ ఐపీఎల్​ సీజన్​లో రాజస్థాన్​ రాయల్స్​ ప్లేయర్​ బెన్​ స్టోక్స్​ ఆడే విషయమై ఇంకా క్లారిటీ లేదని ఆ జట్టు కోచ్ మెక్​డొనాల్డ్​ అన్నారు. ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ స్టోక్స్​ ప్రస్తుతం న్యూజిలాండ్​లో కాన్సర్​తో బాధపడుతున్న తన తండ్రి వద్ద ఉన్నాడని వెల్లడించారు. అతడికి అవసరమైనంత సమయాన్ని ఇస్తున్నామని తెలిపారు.​

“స్టోక్స్​  ఫ్యామిలీ గురించే మా బాధంతా. అతడు కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అతడికి అవసరమైనంత టైమ్ ఇస్తున్నాం. ఐపీఎల్​లో అతడు ఆడటం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను” అని మెక్​డొనాల్డ్​ పేర్కొన్నారు. పాకిస్థాన్​తో ఫస్ట్ టెస్టు తర్వాత స్టోక్స్​ మళ్లీ  గ్రౌండ్ లోకి అడుగుపెట్టలేదు.

యూఏఈ వేదికగా ఈనెల 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ టోర్నీ​ జరగనుంది. టోర్నీలోని మొదటి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్​కింగ్స్​ తలపడనున్నాయి. కాగా అన్ని జట్లు ఆత్మవిశ్వాసంతో రేస్ లోకి దిగబోతున్నాయి. అన్ని జట్ల ఆటగాళ్లు కఠోర సాధన చేస్తూ గ్రౌండ్ లో కష్టపడుతున్నారు.

Also Read :

టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ రావు కన్నుమూత

విచారణకు పిలిస్తే, మాజీ రౌడీషీటర్ ఆగమాగం

డేటింగ్ పేరుతో లూఠీ, కాల్ చేస్తే బుక్కైనట్లే