భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణములో జగదాంబ సెంటర్ నుండి లలిత కళా మందిర్ వరకు చేపట్టిన అర్&బి రోడ్డు విస్తరణ ఉద్రికత్తకు దారితీసింది. ఈ విషయంలో స్థానికులకు, టిఆర్ఎస్, మున్సిపల్, ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రామ్ లాల్ అనే నాయకుడిపై మున్సిపల్ ఛైర్మన్ సాక్షిగా వైస్ చైర్మెన్ జానీపాషా భూతులు తిడుతూ దాడికి దిగాడు. ఒక వాస్తావాన్ని అడిగినందుకు తనపై మున్సిపల్ వైస్ ఛైర్మన్ జానీ చెయ్యి చేసుకున్నాడని రామ్ లాల్ పోలీసులకు ఫిర్యాదు. ఈ సందర్భంగా కాస్త ఉద్రికత్త వాతావరణం ఏర్పడ్డంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.