Road Accident In Hyderabad: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కెబిఆర్ పార్క్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ వరకు ట్రాఫిక్ స్తంభించిపోగా.. పోలీసులు స్పాట్‌కు చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.