శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతుంది. దాంతో జూరాల డ్యామ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అందువల్ల కొంత నీటిని శ్రీశైలం...

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి

Updated on: Aug 18, 2020 | 4:26 PM

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతుంది. దాంతో జూరాల డ్యామ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అందువల్ల కొంత నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలంకు వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 3,58,980 క్యూసెక్కులు ఉంది.

తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోని ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువన నాగార్జుననసాగర్ కు 40,259 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుతం నీటి మట్టం 876.80 అడుగుకు చేరింది.

అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 172.2620 టీఎంసీలుగా ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us