24 గంటల్లో 180 మంది కరోనాతో మృతి

|

Sep 28, 2020 | 8:52 PM

దేశంలో కరోనా ప్రభల కేంద్రంగా మహారాష్ట్ర మారిపోయింది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 2.65 లక్షలకుపైగా ఉన్నది. ఆ రాష్ట్రంలో ప్రతి రోజు పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి.

24 గంటల్లో 180 మంది కరోనాతో మృతి
Follow us on

కరోనా వ్యాప్తి ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పడుతుంటే.. మహారాష్ట్రలో మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. మహమ్మారిని అడ్డుకట్టు వేడయంలో విఫలమవుతోంది అక్కడి ప్రభుత్వం. సామాన్య ప్రజల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కరోనా వైరస్‌కు చిక్కుతున్నారు. కోవిడ్‌పై ముందు వరసలో ఉండి పోరాడుతున్న పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య కూడా అధికంగా ఉంది.

దేశంలో కరోనా ప్రభల కేంద్రంగా మహారాష్ట్ర మారిపోయింది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 2.65 లక్షలకుపైగా ఉన్నది. ఆ రాష్ట్రంలో ప్రతి రోజు పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి.

కేవలం ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు గత 24 గంటల్లో కొత్తగా 11,921 కరోనా కేసులు నమోదయ్యాయి. కేవలం ఈ 24 గంటల్లో 180 మంది కరోనాతో మరణించారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,51,153కు, మరణాల సంఖ్య 35,751కు చేరింది.

గత 24 గంటల్లో 19,932 మంది కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 10,49,947 మంది కోలుకోగా ప్రస్తుతం 2,65,033 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.