ప్రశ్నార్ధకంగా మారిన రిషబ్ పంత్ కెరీర్..బద్దకాన్ని వదిలేస్తేనే మంచి ఫ్యూచర్ అంటున్న సీనియర్లు

రిషబ్ పంత్ కెరీర్ ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారిపోయింది. భారత జట్టుకు ఎంపికైన తొలినాళ్లలో దూకుడైన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు రిషబ్ పంత్. అయితే భవిష్యత్‌లో ధనీ స్థానాన్ని భర్తీ చేస్తాడనుకున్నారు టీమిండియా...

ప్రశ్నార్ధకంగా మారిన రిషబ్ పంత్ కెరీర్..బద్దకాన్ని వదిలేస్తేనే మంచి ఫ్యూచర్ అంటున్న సీనియర్లు

Updated on: Dec 09, 2020 | 5:23 AM

రిషబ్ పంత్ కెరీర్ ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారిపోయింది. భారత జట్టుకు ఎంపికైన తొలినాళ్లలో దూకుడైన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు రిషబ్ పంత్. అయితే భవిష్యత్‌లో ధనీ స్థానాన్ని భర్తీ చేస్తాడనుకున్నారు టీమిండియా అభిమానులు. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో కేవలం టెస్టు జట్టులో మాత్రమే చోటు దక్కింది.

దీనికి ప్రధాన కారణం అతడి బద్దకమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. పంత్ తనకున్న బద్దకాన్ని వదిలేసి ఆట మీద దృష్టి పెడితే మంచిదన్నారు. నిర్లక్ష్యమైన ఆటతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఆటు రాహుల్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్న నేపథ్యంలో పంత్ మళ్లీ జట్టులోకి వస్తాడా లేదా అనే ప్రశ్నార్ధకంగా మారింది.

పంత్‌ ఆటతీరు ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో టెస్టు జట్టులో కూడా చోటు దక్కడం కష్టమేనని ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యానించారు. వాస్తవానికి పంత్ గతేడాది నుంచి సరైన ప్రదర్శన చూపించలేదు. ఇప్పటికే టీ20, వన్డే జట్టులో పంత్ స్థానాన్ని కోల్పోయాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా సెటిల్ అవ్వడంతో పంత్‌కు అవకాశమే లేకుండా పోయింది.

ఆస్ట్రేలియా టూర్‌కు రిషబ్ పంత్‌ను కేవలం టెస్టు జట్టుకు మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అయితే కేఎల్ రాహుల్‌ ఫామ్‌ దృష్యా.. మరోవైపు వృద్ధిమాన్‌ సాహాకు టెస్టుల్లో ఉన్న రికార్డు చూసుకుంటే పంత్‌ టెస్టులు ఆడడం కష్టమే అని అంటున్నారు. ఆసీస్‌-ఏతో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనూ ఇండియా-ఏ తరపున పంత్‌ స్థానంలో సాహాకు స్థానం లభించింది. రానున్న రోజుల్లో పంత్‌ టెస్టుల్లో కూడా తన స్థానాన్ని కోల్పోనున్నాడు.