రిలయన్స్ జియో: 13 ఒప్పందాలు.. రూ .1.52 లక్షల కోట్ల పెట్టుబడులు..

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. చిన్నా, చితకా వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లోకి

రిలయన్స్ జియో: 13 ఒప్పందాలు.. రూ .1.52 లక్షల కోట్ల పెట్టుబడులు..

Edited By:

Updated on: Jul 17, 2020 | 3:18 PM

Reliance Jio: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. చిన్నా, చితకా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లోకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. అమెరికా 5జీ టెక్నాలజీ దిగ్గజం క్వాల్‌కామ్… జియోలో రూ.730 కోట్లతో 0.15 శాతం వాటాను తీసుకుంది. రిలయన్స్ జియోకు 12 వారాల్లో ఇది 13వ భారీ పెట్టుబడి. ఈ కంపెనీలు జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఒక లక్ష 52 వేల కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. ఏప్రిల్ 22వ తేదీన ఫేస్‌బుక్ రూ.43,574 కోట్లతో 9.99 శాతం వాటాను కొనుగోలు చేసింది. అప్పటి నుండి పెట్టుడుల వరద పారుతోంది.

Also Read: యూజీసీ మార్గదర్శకాల మేరకు.. పరీక్షల నిర్వహణకే మొగ్గు..

Also Read: ఇక ప్రీ స్కూల్స్ గా అంగన్‌వాడీలు.. ఆన్‌లైన్‌లో బోధన..